

శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయ పాలక మండలిలో సభ్యులుగా అవకాశం కల్పించాలని టీడీపీ నేత ముని రాజా యాదవ్ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని కోరారు. ఈ మేరకు మంగళవారం అమరావతిలో ఎమ్మెల్యేను సన్మానించి వినతి పత్రాన్ని అందజేశారు. మండల టీడీపీ సీనియర్ నాయకులు పేరం ధనుంజయలు నాయుడు, కందాటి శివ శంకర్ రెడ్డి, రంగినేని చెంచయ్య నాయుడు, పాపిరెడ్డి, కన్నలి మోహన్ రెడ్డి, కేశినేని సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.