జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేసిన నవ్వ భారతి యువజన సంఘం అధ్యక్షులు భాస్కర్
మెదక్ జిల్లా ప్రతినిధి నవంబర్ 11 మన న్యూస్
టేక్మాల్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో వడ్ల కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపలని టేక్మాల్ గ్రామానికి పంపాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్డిఏ పిడి శ్రీనివాస్ రావు గారికి వినతి పత్రాన్ని అందజేసి టేక్మాల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేసినప్పటికీ లారీలు లారీలు రాకపోవడంతో రైతుల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాని.
జిల్లా అదనపు కలెక్టర్, డి ఆర్ డి ఏ, పిడి దృష్టికి తీసుకెళ్లారు.
గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన ఐకెపి.కోఆపరేటివ్. డీసీఎంఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన బ్యాగులు సుమారుగా 4000 వీళ్లకు పైగా ఉన్నాయని వరి ధాన్యం కుప్పలు తెప్పలుగా ప్రతి వరి కొనుగోలు సెంటర్లలో చాలా ఉన్నాయని వివరించారు. వరి కొనుగోలు సెంటర్లు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ సంభందిత అధికారులు లారీలు ఏర్పాటు చేయలేదని తెలిపారు. లారీలు రాకపోవడంతో రైతులు చాలా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రైతులపై దయతలిచి వెంటనే టేక్మా గ్రామపంచాయతీకి వరి ధాన్యం కొనుగోలు సెంటర్లకు లారీలు పంపగలరని జిల్లా అధికారులను కోరడంతో వెంటనే జిల్లా అదనపు కలెక్టర్ స్పందించి వెంటనే లారీ ఏజెన్సీ వాళ్ళతో ఫోన్ లో మాట్లాడిన వెంటనే లారీల సమస్యను సలు చేస్తామని హామీ ఇచ్చారని భాస్కర్ తెలిపారు.









