తిరుపతి, నవంబర్ 11
(మన న్యూస్ )
ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ప్రతి శనివారం గోవింద నామ సంకీర్తనలతో భక్తి భావాన్ని పెంచుతున్న స్థానిక భజన మండలి కళాకారుల 150 మంది సభ్యులు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వనభోజనాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.. స్థానిక రామాపురం సమీపంలోని ఓ వనంలో ఉసిరి చెట్టు కింద పరమశివుని చిత్రపటాన్ని నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాఖాహార వంటకాలను అక్కడే తయారుచేసి సభ్యులందరూ వనభోజనాలను స్వీకరించారు. అంతకుమునుపు సభ్యులందరూ కలిసి ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా భజన మండల సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ శివ కేశవులకు ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కానీ లేదా జిమ్మి చెట్టు కింద గాని శివకేశవలను పూజించి భోజనాలు చేయడం వలన మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసు దేవ రెడ్డి, పులిగోరు ప్రభాకర్ రెడ్డి, మునినాధ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మల్లారపు రవి ప్రసాద్, దేసు నాగేశ్వరరావు, కొండే చెంగారెడ్డి, జయమ్మ, ధనమ్మ, చంద్రకళ, విగ్రహాల కళ్యాణి, జ్యోతి, యశస్విని, భాగ్యలక్ష్మి, కళావతి, పొన్నాల జేజిరెడ్డి, కృష్ణమూర్తి రెడ్డి, ప్రసాదు, శ్రీనివాసులు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మురళి, వాసు, తిరుపాల చారి, అన్నురా చారి, బ్రహ్మానందం, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *