Oplus_131072

మనన్యూస్,నిజాంసాగర్,జుక్కల్,పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో అఖండ హరినామ సప్తాహా లో భాగంగా ఏడవ రోజు శుక్రవారం గాథ పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా
సప్తాహా అధ్యక్షులు విఠల్ మహారాజ్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు శ్రీదేవి మల్లప్పపటేల్ , సరోజ విజయ్ దేశాయ్ లు గాథ పూజ చేశారు.ఏడు రోజులుగా సాగుతున్న అఖండ హరినామ సప్తాహా కార్యక్రమంలో ప్రతి రోజు గాథ భజన,ప్రవచనం,హరి పాఠ్,హరి కీర్తన ,హరి జాగరణ,కాకడ హారతి కార్యక్రమాలు నిర్వహించారు.ప్రతి రోజు భక్తులకు అన్న ప్రసాదం అందించారు.ఈ కార్యక్రమాలకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు,భజన మండళ్లు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *