మహా ఘనంగా జరిగిన మహా భక్తి ఛానెల్ ఈవెంట్!

మన న్యూస్:- . మహాన్యూస్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కాజ సమీపంలోని శ్రీ దశావతార టెంపుల్ గ్రౌండ్స్ లో నిర్వహించిన శివోహం, మహా భక్తి ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ,శ్రీశ్రీశ్రీ మహా మండలేశ్వర్ కైలాసానంద గిరిజా మహారాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహా భక్తి టీవీ సాంగ్ ను ఆవిష్కరించారు. ఉపనిషత్తుల సారాంశాన్ని తెలిపే వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మహా భక్తి ఛానల్ కోసం ఇంకా ఈ ఈవెంట్ కోసం పని చేసిన సిబ్బందిని మెచ్చుకున్నారు. వారికి ఎప్పుడు శివుని ఆశీస్సులు ఉండాలని కోరారు. కైలాష్ ఆనందగిరి స్వామీజీతో కలిసి ఈ వేడుకని జరుపుకోవడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా అన్నారు. శివుని ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని ప్రార్ధించారు. ఇంకా మహా టీవీ అధినేత వంశీ గురించి మాట్లాడుతూ.. ఆంధ్రజ్యోతిలో రిపోర్టర్ గా పని చేసి నేడు మహా టీవీని స్థాపించి చరిత్ర సృష్టించారని వంశీ గారిని అభినందించారు. వంశీ అసలు భయపడరని, ఆయనలోని పట్టుదల, తెలివి, కృషి తనని ఇంత గొప్పవాడిగా మార్చాయని అన్నారు. సామాన్య వ్వక్తి తలచుకుంటే ఏమైన సాధించవచ్చని వంశీ నిరూపించారని చంద్రబాబు నాయుడు అన్నారు. వంశీ కి అందరి తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ..మహాశివరాత్రి రోజున మహా భక్తి ఛానెల్ ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన నిరంజనీ పీఠాధీశ్వర్ స్వామీజీ శ్రీశ్రీశ్రీ మహా మండలేశ్వర్ కైలాసానంద గిరిజా మహారాజ్ కి భక్తి పూర్వక నమస్కారాలు తెలియజేశారు. గిరిజా మహారాజ్ ని ఇక్కడ ఇలా కలుసుకోవడం, ఆయన ఆశీర్వాదం తీసుకోవడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాని అన్నారు.శివుడ్ని తలచుకున్నా, అయన విగ్రహాన్ని చూసినా ధైర్యం వస్తుందని అన్నారు. నేడు మహా గ్రూప్ ఛానెళ్లకు మేనేజింగ్ డైరెక్టరుగా ఎదిగిన మారెళ్ల వంశీకృష్ణ ని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభినందించారు. మహా కుంభమేళా ఆఖరి రోజున, మహా శివరాత్రి పర్వదినాన మొదలైన మహా భక్తి ఛానెల్ హిందూ ధర్మాన్ని కాపాడటానికి కృషి చేయాలన్నారు. ఛానెల్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కైలాష్ ఆనందగిరి స్వామీజీ మాట్లాడుతూ.. ప్రజల మధ్యలో మహా టీవీ భక్తి ఛానెల్ ఉద్భవించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మారెళ్ల వంశీకృష్ణ ఆధ్వర్యంలో లింగాభిషేకం అద్భుతంగా జరిగిందని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం వారి అదృష్టం అని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొడం చాలా అదృష్టంగా భావిస్తున్న అన్నారు. అలాగే MP పెమ్మసాని మాట్లాడుతూ.. మహా న్యూస్ అధినేత వంశీ విజయవంతమైన ప్రయాణాన్ని అభినందించారు. తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై వంశీ గారు చేసిన సేవలని ప్రశంసించారు. సాధారణ మండల స్థాయి జర్నలిస్ట్ నుంచి ఆధ్యాత్మిక టీవి ఛానల్ స్థాపన చేపట్టేలా ఎదిగినందుకు వంశీ గారిని మన స్ఫూర్తిగా అభినందించారు. ఇక మహా న్యూస్ చైర్మన్ వంశీ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం జరపడం మహా అందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలని అభినందించారు. ఈ మహోత్తర కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కైలాష్ ఆనందగిరి స్వామీజీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. మహా భక్తి ఛానల్ ని ఏర్పాటు చెయ్యడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.ఇక ఈ మహా కార్యక్రమం ఇంత సక్సెస్ కావడానికి ఆర్ట్ డైరెక్టర్లు హరివర్మ, మల్లి ప్రధాన కారణం అని చెప్పుకోవాలి. ఫిబ్రవరి 8 నుంచి కష్టపడుతూ ఫిబ్రవరి 26 లోపు ఆర్ట్ వర్క్ ని పూర్తి చెయ్యడం నిజంగా అభినందించదగ్గ విషయం. వీళ్లు గతంలో పలు సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్లుగా కూడా పని చేశారు. వాళ్లకి ఉన్న అనుభవంతో ఈ కార్యక్రమాన్ని తమ ఆర్ట్ తో పరిపూర్ణంగా చేశారు.

  • Related Posts

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    ఉదయగిరి : (మన ద్యాస న్యూస్ ) : ప్రతినిధి నాగరాజు :///// ఉదయగిరి మండల కేంద్రం జి చెర్లోపల్లి గ్రామంలో బీసీ కులాలకు చెందిన కొంతమంది ఎస్సీ కాలనీలో జొరబడి స్థలాలను ఆక్రమించి వారిపై దాడులకు దారితీసి కులం పేరుతో…

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    అనంతపురం,సెప్టెంబర్ 10 : (మనద్యాస న్యూస్) ప్రతినిధి : నాగరాజు ://///// రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో అనంతపురంలో బుధవారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///