

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా మక్తల్ నియోజక వర్గం దాసర్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొల్లూరు వెంకటప్ప గురువారం తెల్లవారుజామున గుండె పోటుతో మరణించిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వారి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబం సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు, అనంతరం కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలి తాయప్ప, వెంకట్రములు,రాజేందర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.