

మనన్యూస్,నారాయణ పేట:మక్తల్ నియోజకవర్గంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం చంద్రశేఖర్ ఆజాద్ గారి వర్ధంతి వేడుకలను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఘనంగా నిర్వహించారు. చంద్రశేఖర్ ఆజాద్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రిటిష్ పాలకులకు ఎదురు పోరాడిన యోధుడు ఆజాద్ అని, ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలోపాల్గొన్నారు.