చీకూరిపల్లి సిద్దేశ్వర స్వామి ఆలయానికి ఒక లక్ష రూపాయలు విరాళం అందించిన డి.సరస్వతి ఎన్ పి సుధాకర్ నాయుడు.

బంగారుపాళ్యం ఫిబ్రవరి 26 మన న్యూస్

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం చీకూరుపల్లి పంచాయతీ కేజీ సత్రం సమీపానగల సిద్దేశ్వర స్వామి కొండపై వెలసిన శివుని అనుగ్రహం కొరకు భక్తులు మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం నుండి గుహ లోపల గల సిద్దేశ్వర స్వామి దగ్గర అభిషేకాలు అర్చనలు ఆశీర్వచనాలు వంశీ స్వామి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. సిద్దేశ్వర ఉత్సవ విగ్రహం దగ్గర బంగారు పాల్యం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్ పీ జయప్రకాష్ నాయుడు, ఎన్ పీ ధరణి నాయుడు ప్రత్యేక ప్రార్థనలతో స్వామివారిని పూజించి దర్శించుకున్నారు. కొండపై భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో కొండకు రావడానికి కారణాలు గత కొన్ని సంవత్సరాలుగా బిడ్డలు లేని వారికి స్వామి కృపవలన బిడ్డలు కలగడం లాంటివి జరగడంతో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారని గ్రామస్తులు తెలిపారు. కార్యక్రమంలో చీకూరుపల్లి కేజీ సత్రం సి ఆర్ నగర్ లక్ష్మీ నగర్ వాసులు యువకులు గ్రామ పెద్దలు మహిళలు ఉదయం నుండి స్వామివారి దర్శనంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంగారుపాలెం మండలానికి చెందిన గత సరోజినీ స్కూల్ యాజమాని డి.సరస్వతి, ఎన్ పీ సుధాకర్ నాయుడు, చికూరిపల్లి కొండపై వెలసిన సిద్దేశ్వర స్వామికి మహాశివరాత్రి సందర్భంగా లక్ష రూపాయలు విరాళంగా గుడికి అందజేశారు. సిద్దేశ్వర స్వామి కొండపై నాగుల రాళ్ల నిర్మాణం, చుట్టూ రచ్చ దానిపై టైల్స్ కొరకు రెండున్నర లక్షల రూపాయలు విరాళం ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో రఘుపతి నాయుడు (చికూరిపల్లి హెడ్మాస్టర్ ) బంగారుపాలెం ప్రభుత్వ పాఠశాల టీచర్ సుమతి, కేజీ సత్రం రిటైర్డ్ టీచర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సిద్దేశ్వర స్వామి కొండపై దర్శనానికి చిత్తూరు మేయర్ కటారి హేమలత వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు