

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దాతల సహకారంతో మహానందుడు కొత్త రూపు సంతరించుకున్నాడు.గత సంవత్సర కాలంగా ఎండకి ఎండి,వానకు తడడంతో నందీశ్వరుని విగ్రహం రంగు పోయి కళావిహీనంగా తయారయింది.దీంతో ఈ సంవత్సరం పర్వదినాన్ని పురస్కరించుకుని కెళ్ళిం సూర్యారావు, నూకరాజు దంపతుల పెద్ద కుమారుడు కెళ్ళిం సత్యనారాయణ జ్ఞాపకార్థం నందీశ్వరునికి నూతనంగా రంగులు వేయించి నందీశ్వరునిపై తమ భక్తి ప్రపోతులను చాటుకున్నారు. సత్యనారాయణ సోదరులు కెళ్ళిం దుర్గాప్రసాద్,వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ ప్రత్యేక మా సోదరుని జ్ఞాపకార్థం మహానందీశ్వరునికి మా సొంత ఖర్చులతో రంగులు వేయిస్తున్నామని,ఆ మహానందీశ్వరునికి రంగులు వేయించి భక్తులకు మహాశివరాత్రి నాటికి పూజలు అందుకునేందుకు సిద్ధం చేశామన్నారు.ఈ కార్యక్రమంలో కె.సురేంద్ర,మహేష్, కుటుంబ సభ్యులు సేవలందించారు.