

మనన్యూస్,నెల్లూరు:పోగతోటలో రాజన్న మిలిటరీ హోటల్ ఆదివారం ఉదయం తెలుగుదేశం నాయకులు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ప్రారంభించినారు.ఈ హోటల్ అధినేత పిక్కిలి రాజా మాట్లాడుతూ హోటల్ రంగంలో 15 సంవత్సరాల అనుభవంతో రాజన్న మిలిటరీ హోటల్ ప్రారంభించడం జరిగింది అన్నారు. ఎక్కడ లేని విధంగా కొత్తరుచులతో,అందరికి అందుబాటు ధరలలో నోరూరించే ఫుడ్ ఐటమ్స్ ఉదయం 6 గంటలకే నోరూరించే ఫుడ్ ఐటమ్స్ తో అందించడం జరుగుతుంది.మా స్పెషల్ ఐటమ్స్ లైవ్ కుండ పలావ్,కుండ చేపల చికెన్ బిర్యాని తదితరుల ఐటమ్స్ మా వద్ద లభించును అని అన్నారు.
మీ అందరిని ఆనంద పరచాలని రాజన్న మిలిటరీ హోటల్ ప్రారంభించడం జరిగింది అని అన్నారు.నెల్లూరు ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.మేకల రమేష్ బాబు మాట్లాడుతూ.మా మిత్రుడు రాజా హోటల్ రంగంలో మంచి అనుభవంతో నెల్లూరు పొగతోట లో రాజన్న మిలిటరీ హోటల్ ప్రారంభించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అని తెలిపారు.ఈ హోటల్ కొత్త రుచులతో అందరికీ అందుబాటు ధరలలో నోరూరించే ఫుడ్ ఐటమ్స్ తో మీ ముందుకు వచ్చింది అని అన్నారు.ప్రజలందరూ ఈ హోటల్ కి వచ్చి మిత్రుడు రాజాను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో మేకల రమేష్ బాబు,గద్దె జగదీష్,నాగిశెట్టి బాబురావు,ఆనంద్,నారాయణ తదితరులు పాల్గొన్నారు.
