

మనన్యూస్,తిరుపతి:తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఇటీవల నామినేటెడ్ పదవులు పొందిన నాయకులకు తిరుపతి టిడిపి నగర్ మహిళా అధ్యక్షురాలు బ్యాంకు శాంతమ్మ ఆధ్వర్యంలో గజపూల మాలతో ఘనంగా సత్కరించారు.సోమవారం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ స్వగృహం వద్ద ఇటీవల నామినేటెడ్ పదవులు పొందిన శాప్ చైర్మన్ రవి నాయుడు,నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ రుద్రకోటి సదాశివం,ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ లను బ్యాంకు శాంతమ్మ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి షాలోతో సత్కరించి అందరిని గజపోలమలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా వారందరికీ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పుష్పావతి యాదవ్,నియోజకవర్గం పరిశీలకులు చిట్టిబాబు,రాష్ట్ర జిల్లా నగర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.