

మనన్యూస్,తిరుపతి:ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య, తిరుపతి బ్రాహ్మణ సమాజం సంయుక్తంగా రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల వివాహా పరిచయ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం బైరాగిపట్టెడ లోని శ్రీ వైఖానస కళ్యాణ వేదికలో జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొని పూజలు నిర్వహించారు.బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదికలో రిజిస్టర్ చేసుకున్న వారి వివరాల పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.కుటుంబ వ్యవస్థకు పెళ్లి ఒక పట్టుకొమ్మ అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు.సనాతన ధర్మాన్ని ఆచరించే బ్రాహ్మణలు ఆధునిక కాలానికి తగ్గట్టు వధూవరుల వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసుకుని తమ అభిరుచులకు తగిన వధూవరులను ఎంచుకోవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఏపి బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు నాగరాజుగారి వెంకటరామరాజు,కార్యదర్శి వాసుదేవరావు,తిరుపతి బ్రాహ్మణ సమాజం అధ్యక్షులు భీమాస్ బాలాజీ,ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అజయ్ కుమార్,కోశాధికారి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.