

Mana News :- జనసేన పార్టీ తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్ వ్యవహారం గత రెండు రోజులుగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. కిరణ్ రాయల్ మీద ఓ మహిళ ఆరోపణలు చేయడం, ఆత్మహత్యాయత్నం సంచలనం రేపాయి. ఆ తర్వాత కిరణ్ రాయల్ ఆడియో, వీడియోలు వైరల్ కావటంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యా్ణ్ కిరణ్ రాయల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి పరిశీలన చేయాలని పార్టీ కమిటీని ఆదేశించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్‌ను ఆదేశించారు. జనసేన తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్‌పై ఓ మహిళ ఆరోపణలు, వీడియోలు సంచలన రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొన్నిరోజులుగా కిరణ్ రాయల్ మీద మీడియాలో వస్తున్న ఆరోపణలపై పూర్తిస్థాయి పరిశీలన జరపాల్సిందిగా పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు జనసేన పార్టీ కాన్‌ఫ్లిక్ట్ కమిటీని ఆదేశించారు. అలాగే పార్టీ ఆదేశాలు వచ్చే వరకూ జనసేన పార్టీ కార్యక్రమాలకు కిరణ్ రాయల్‌ను దూరంగా ఉంచాలని నిర్ణయించారు. ఈ మేరకు జనసేన పార్టీ నుంచి ఓ ప్రకటన విడుదలైంది. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణులకు జనసేన కీలక విజ్ఞప్తి చేసింది. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి పెట్టాలని.. సమాజానికి ఉపయోగం లేని వ్యక్తిగతమైన విషయాలను పక్కనబెట్టాలని జనసైనికులు, వీరమహిళలు, పార్టీ నేతలకు పపన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అలాగే చట్టానికి ఎవరూ అతీతులు కాదని, చట్టం తన పాని తాను చేస్తుందని స్పష్టం చేశారు.