తల మూవీ నుంచి ‘ప్రేమ కుట్టిందంటే’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల

Mana News :- అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా రూపొందిన సినిమా తల. రీసెంట్ గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేతుల మీదుగా విడుదలైన ఈ మూవీ తమిళ్, తెలుగు ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. చూసిన వాళ్లంతా సూపర్బ్ అని మెచ్చుకుంటున్నారు. రణం తర్వాత అంతకు మించిన బ్లాక్ బస్టర్ ను అందుకోబోతున్నాడు అమ్మ రాజశేఖర్ అనే టాక్ కూడా వినిపిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ప్రేమ కుట్టిందంటే’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. పాట వినగానే ఇమ్మీడియెట్ గా కనెక్ట్ అయిపోయేలా ఉంది. బిగ్ బాస్ ఫేమ్ ఎనర్జిటిక్ సింగర్ భోలే షావలీ పాడిన ఈ గీతాన్ని మ్యూజిక్ డైరెక్టర్ ధర్మతేజ రాశాడు. విశేషం ఏంటంటే.. ఈ పాటను తమిళ్ లో మల్టీ టాలెంటెడ్ లెజెండరీ పర్సనాలిటీ టి రాజేందర్ పాడారు. ఇలాంటి హుషారైన గీతాలకు టి. రాజేందర్ పెట్టింది పేరు. అందుకే ఈ పాట తమిళ్ లోనూ ఊపేస్తోంది. ప్రధానంగా ఈ పాటను కమెడియన్ ముక్కు అవినాష్ పై చిత్రీకరించారు. ప్రేమలో పడితే ఎదురయ్యే సమస్యలు, కష్టాలు ఎలా ఉంటాయో అతను వివరిస్తున్నట్టుగా ఉంది సాహిత్యం. రణం చిత్రంలో అలీపై చిత్రీకరించిన ‘నమ్మొద్దు నమ్మొద్దూ ఆడవాళ్లను నమ్మొద్దూ’ అనే పాట ఎంత పెద్ద హిట్ అయిందో అంతకు మించిన హిట్ అయ్యే పాటలా ఉంది.  
‘చీమ ఎక్కడ కుడితే అక్కడే మంట పడుతుందయా.. దోమ కుట్టిందంటే వస్తుంది మలేరియా.. కానీ ప్రేమ కుట్టిందంటే పిచ్చెక్కిపోతుందయా’ అంటూ మొదలైన ఈ పాటలో ఈ తరం యూత్ కు బాగా నచ్చేలా ఉంది సాహిత్యం. ప్రేమలో పడితే అమ్మాయిలు పెట్టించే ఖర్చులు, వారు పెట్టే ఇబ్బందులు తెలుపుతూ ఆఖర్లో ప్రేమ గురించి అడిగితే ‘హూ ఆర్ యూ’ అందిరా అంటూ వచ్చే ఫినిషింగ్ టచ్ ఆకట్టుకుంటుంది. 
ఈ చిత్రాన్ని ఈ నెల 14న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నారు. దర్శకుడు: అమ్మ రాజశేఖర్ ,నిర్మాత : శ్రీనివాస గౌడ్,బ్యానర్: దీపా ఆర్ట్స్,నటీనటులు: అమ్మ రాగిన్ రాజ్, అంకిత నస్కర్, రోహిత్, ఎస్తేర్ నోరోన్హ, ముక్కు అవినాశ్, సత్యం రాజేశ్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, శ్రవణ్ ,రైటర్స్: అమ్మ రాజశేఖర్ ,డీఓపీ: శ్యామ్ కె నాయుడు ,సాంగ్: థమన్ ఎస్‌ఎస్,మ్యూజిక్ డైరెక్టర్: ధర్మ తేజ, అస్లాం కేఈ ,బీజీఎం: అస్లాం కేఈ, డైలాగ్స్: అమ్మ రాజశేఖర్ అండ్ టీం,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాధ రాజశేఖర్ ,ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ ,డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్: అమ్మ రాజశేఖర్ ,లిరిసిస్ట్స్: ధర్మతేజ ,ఎడిటర్ : శివ సామి,పీఆర్వో: మధు వీఆర్ ,డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం.

  • Related Posts

    మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

    Mana News, Mana Cinema :-తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్…

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారతీయ సంస్కృతి ఆచార సాంప్రదాయాలను కాపాడుకుందాం – బోలా శీను.

    భారతీయ సంస్కృతి ఆచార సాంప్రదాయాలను కాపాడుకుందాం – బోలా శీను.

    బలరామ్మూర్తి త్వరగా కోలుకోవాలి..

    బలరామ్మూర్తి  త్వరగా కోలుకోవాలి..

    పసి హృదయాన్ని కాటేసిన మృత్య గుంత !

    పసి హృదయాన్ని కాటేసిన మృత్య గుంత !

    మేధావులు మేధావి శక్తి తోనే విద్యార్థుల భవిష్యత్తు..

    మేధావులు మేధావి శక్తి తోనే విద్యార్థుల భవిష్యత్తు..

    వికలాంగుల కుటుంబానికి ఎమ్మెల్యే చేయూత అందించిన జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్

    వికలాంగుల కుటుంబానికి ఎమ్మెల్యే చేయూత అందించిన జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్

    నర్వలో ఆయిల్ పామ్ పై రైతులకు అవగాహన సదస్సు

    • By RAHEEM
    • June 29, 2025
    • 4 views
    నర్వలో ఆయిల్ పామ్ పై రైతులకు అవగాహన సదస్సు