

మనన్యూస్,గంగాధరనెల్లూరు:- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి మరియు కూటమి ప్రభుత్వానికి నామినెటెడ్ పోస్టులకు 34 శాతం రిజర్వేషన్ కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపిన జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీలకు నామినెటెడ్ నామినేటెడ్ పదవులకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడం చాలా ఆనందదాయకంగా ఉందని అన్నారు. బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాసి మంత్రివర్గం లో ఆమోదం తెలపడం హర్షణీయమని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధికి తోడ్పడే వ్యక్తి ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని పేర్కొన్నారు.బీసీలకు రిజర్వేషన్ కల్పించడంతో బీసీ లందరూ ఆనందం వ్యక్తం చేశారని బీసీలంతా చంద్రబాబునాయుడు కి రుణపడి ఉంటామని అన్నారు. రాష్ట్రం బీసీలు అభివృద్ధి చెందాలంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు హాయం లోని జరుగుతుందని అన్నారు.