

ఐరాల(కాణిపాకం )ఫిబ్రవరి 3 మన న్యూస్
స్వయంభు వరసిద్ది వినాయక స్వామి దేవస్థానం ఆస్థాన మండపం నందు సోమవారం వసంత పంచమి సందర్భంగా సరస్వతి యాగము ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ సూచన మేరకు పూతలపట్టు నియోజకవర్గం ఐరాల, పూతలపట్టు, యాదమరి, తవణంపల్లి, బంగారు పాల్యం మండలాలలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 2,500 విద్యార్థిని విద్యార్థులు సరస్వతి యాగము లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మురళీమోహన్ తొలుత జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో మాట్లాడి పోన్ ద్వారా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొన లేక పొాయానని విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.అనంతరంఎంఎల్ ఏమాట్లాడుతూ మేము చదువుకునే రోజుల్లో ఇలాంటి ప్రత్యేక పూజలు చేసుకోవడానికి అవకాశం లేదని. పూతలపట్టు నియోజకవర్గం లోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివే విద్యార్థిని ,విద్యార్థులు సరస్వతి యాగము లో పాల్గొనడం గొప్ప విషయమన్నారు. నియోజకవర్గంలో 10వ తరగతి పరీక్ష ఫలితాలలో 100% సాధించాలన్నారు. దేవస్థానం ఈవో పెంచల కిషోర్ మాట్లాడుతూ సరస్వతి యాగము లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులు ఉంటాయని, బాగా చదివి ఉన్న స్థాయికి చేరాలని కోరారు. చిత్తూరు సమగ్ర శిక్ష అడిషనల్ విద్యార్థులు వందశాతం ఫలితాలు సాధించాలి ,పూతలపట్టు నియోజకవర్గం లోని ఐదు మండలాలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివే 2,500 విద్యార్థిని విద్యార్థులకు కాణిపాకం దేవస్థానం తరుపున సరస్వతి యాగము లో పాల్గొనే అవకాశము కల్పించి, ఫ్యాడ్లు, పెన్ లు, కంకణాలు, ప్రతి విద్యార్థికి స్వామివారి ప్రసాదములు పులిహోర, లడ్డు, స్వామివారి ప్రత్యేక దర్శనం, నిత్య అన్నదానంలో విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేసిన ఆలయ ఈవో పెంచల కిషోర్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. విద్యార్థిని విద్యార్థులకు స్వామివారి ప్రసాదాలుఅలాగే ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసిన ఆలయ అధికారులు ఆలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు స్వామివారి ప్రసాదాలు ఎమ్మెల్యే మురళీమోహన్, హర్షల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఎం.వెంకటరమణ అందజేశారు.ఈ కార్యక్రమంలో డి వై ఈవో చంద్రశేఖర్, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు జయ ప్రకాష్ నాయుడు, జయ ప్రకాష్, నరోత్తమ రెడ్డి, ఉదయలక్ష్మి, ఇంద్రాణి, నాగేశ్వరరావు, ఈ ఈ వెంకటనారాయణ, ఏఈఓ లు రవీంద్రబాబు, ఎస్ వి కృష్ణారెడ్డి, ప్రసాద్, సూపర్డెంట్లు వాసు, కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు,ఆలయ మాజీ చైర్మన్ మణి నాయుడు, మాజీ జడ్పిటిసి లతా, మండల కన్వీనర్ గిరిధర్ బాబు, ఎంపీడీవో ధనలక్ష్మి, తాసిల్దార్ మహేష్ కుమార్, విస్తరణ అధికారి కుసుమకుమారి,వేద పండితులు, అర్చకులు,ఐరాల ఎంఈవోలు రుశేంద్రబాబు, దామోదర్ నాయుడు, తవణంపల్లి ఎంఈఓ లు హేమలత ,త్యాగరాజుల రెడ్డి, పూతలపట్టు ఎంఈఓ లు వాసుదేవన్, మధుసూదన్ రెడ్డి, బంగారుపాళ్యం ఎంఈఓ లు నాగేశ్వరరావు, రమేష్ బాబు, యాదమరి ఎంఈఓ లు రుక్మిణమ్మ, ప్రసాద్ మరియు నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.