

మనన్యూస్,చంపపేట్:భారతీయ యోగ సమస్తాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఈస్ట్ వెస్ట్ లో గత కొన్ని సంవత్సరాల నుండి ఉచిత యోగ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసినారు.ఈ కేంద్రాలలో ప్రతిరోజు ఉచితంగా యోగ సాధకులకు యోగ నేర్పడం జరుగుతుంది.దీనిలో భాగంగా భారతీయ యోగా సంస్థ వారు నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో ఏర్పాటు చేసిన వసంతోత్సవ్ తెలంగాణ ఈస్ట్ ప్రెసిడెంట్ కులకర్ని మాట్లాడుతూ భారతీయ యోగా సమస్తాన్ వసంతోత్సవ్ .నగరం నడిబొడ్డున గల నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో ఇది రెండవ సారి యోగ సమస్తాన్ ఆధ్వర్యంలో వసంతోత్సవ్ ఘనంగా నిర్వహించడం అన్నారు.ఈ వసంత ఉత్సవ్ కార్యక్రమానికి నగరంలో నిర్వహించే వివిధ ప్రాంతాల నుండి ఎంతోమంది యోగ శిక్షకులు సాధకులు హాజరయ్యారు.అనంతరం ఇక్కడ నిర్వహించినటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రదర్శనలు చేపట్టారు.ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి చంపపేట్ డివిజన్ ప్రెస్ కాలనీ పార్క్ యోగ ఛీఫ్ లిక్కి మాధవరెడ్డి,సెంటర్ ఇన్ ఛార్జ్ కాయిత లక్ష్మరెడ్డి ఆధ్వర్యంలో యోగ మహిళా సాధకులు కొలట లతో నృత్యాన్ని ప్రదర్శించి వారి నైపుణ్యతను చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో భారతీయ యోగా సమస్తాన్ సభ్యులు.తెలంగాణ ఈస్ట్ ప్రెసిడెంట్ కులకర్ని,డిస్టిక్ త్రీ ప్రెసిడెంట్ బి కృష్ణయ్య,ప్రెస్ కాలనీ యోగ ఛీఫ్ లక్కి మాధవరెడ్డి,సెంటర్ ఇంచార్జి కాయితి లక్ష్మరెడ్డి,యోగ సాధకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.