

మనన్యూస్,తిరుపతి:సినీ హీరో,ఎమ్మెల్యే బాలకృష్ణకు మరిన్ని అవార్డులు వరించాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు.బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా తిరుపతి బాలకృష్ణ ప్యాన్స్ అసోషియేషన్ అభినందన సభ స్థానిక ప్రైవేట్ హోటల్ లో మంగళవారం సాయంత్రం నిర్వహించింది.బాలకృష్ణ ప్యాన్స్ సందడి మధ్య భారీ కేక్ ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కట్ చేశారు.ఎన్టీఆర్ నట,రాజకీయ వారసుడుగా బాలకృష్ణ అనితరసాధ్యమైన ప్రతిభ చూపడంతోనే పద్మభూషన్ అవార్డ్ దక్కిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు.దేశంలోనే మూడో అత్యున్నత పురష్కారమైన పద్మభూషణ్ అవార్డ్ బాలకృష్ణకు దక్కడం ఆయన ప్యాన్స్ కే కాకుండా తెలుగు సీని అభిమానులందరికీ ఎంతో సంతోషం కలిగించిందని ఆయన తెలిపారు.యాభై ఏళ్ళ సినీ ప్రస్థానంతోపాటు ఎమ్మెల్యేగా,బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్వహతో ప్రజా సేవ చేస్తున్న బాలకృష్ణకు మరిన్ని అవార్డులు,పదవులు దక్కాలని శ్రీవేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నట్లు ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ,శ్యాప్ ఛైర్మన్ రవినాయుడు,టిడిపి నాయకులు దంపూరు భాస్కర్,శ్రీధర్ వర్మ,మహేష్ యాదవ్,హేమంత్ కుమార్,ప్యాన్స్ అసోషియేషన్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి,పృధ్వీ,మదన్ తదితరులు పాల్గొన్నారు.