మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మంత్రి తుమ్మల నాగేశ్వర రావును జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మర్యాదపూర్వకంగా కలిశారు.
మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో గత కొద్ది రోజుల నుండి సోయా కొనుగోలు కేంద్రం మూతపడటంతో సుమారు 8 వేల క్వింటాళ్ల సోయాబీన్ ధాన్యం మిగిలిపోవడంతో
రైతులు ఆందోళన చెందుతుండగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు దగ్గరికి రైతులను తీసుకెళ్లి పరిస్థితి గురించి వివరించాగా మంత్రి స్పందించి మిగిలిపోయిన సోయా పంటను కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు.సమస్యను తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే స్పందించి రైతులకు అండగా నిలబడిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నియోజకవర్గ రైతులు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *