

మనన్యూస్.తిరుపతి జిల్లా:శ్రీకాళహస్తి
జయప్రదం చేయండి జిల్లా మహాసభలను
జనవరి 28,29 తేదీలలో SFI జిల్లా మహాసభలు భారత విద్యార్థి ఫెడరేషన్ SFI 5 వ జిల్లా మహాసభలు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం లో జరుగుతాయి అని SFI జిల్లా కార్యదర్శి భగత్ రవి SFI శ్రీకాళహస్తి అధ్యక్షులు,కార్యదర్శి గురువయ్య, డేవిడ్ చరణ్ లు తెలిపారు.సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు జిల్లా మహాసభ ల పోస్టర్స్ ఆవిష్కరించారు.ఈ జిల్లా మహాసభ లో శ్రీకాళహస్తి లో విద్య రంగ సమస్యలు గురించి చర్చించి భవిష్యత్తు లో పోరాటాలు కోసం ఈ మహాసభ వేదిక అవుతుంది అని వారు అన్నారు. శ్రీకాళహస్తి లో ప్రభుత్వ హాస్టల్ లో అనేక సమస్యలు ఉన్నాయి అని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలుపడుతున్నారని వారు అన్నారు.అంత పేద గ్రౌండ్ ఉన్నపటికి చెత్త,చెదారం తో విద్యార్థులు ఆడుకోడానికి వీలు లేని పరిస్థితి అని వారు అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల,మహిళా కళాశాల లో కనీస సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.అదే విదంగా స్కిట్ (SKIT) ఉన్నపటికీ అది నిర్వహణ లేక మూలకు పడిపోయింది అని తక్షణమే స్కిట్ ను అందుబాటులో కి తీసుకొచ్చి విద్యార్థులు కు స్కిల్స్ నేర్పించాలని అన్నారు.ఈ సమస్యలు అన్నిటిపై SFI జిల్లా మహాసభ లో చర్చించి పోరాటాలకు సిద్ధం అవుతుంది అని వారు అన్నారు.ఈ కార్యక్రమం లో SFI శ్రీకాళహస్తి నాయకులు సుకుమార్,సుమంత్,ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు