

మన న్యూస్,ఎస్ఆర్ పురం:-ఎస్ఆర్ పురం మండలం కొత్తపల్లి సెక్టార్ తయ్యురు పంచాయతీ పెద్ద తయ్యురు సాక్ష్యం అంగన్వాడి కేంద్రంలో గర్భవతులు ,బాలింతలకు సహజ ఆకుకూరలను పంపిణీ చేసిన అంగన్వాడీ టీచర్ మార్త.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్వేటినగరం ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ సీడీపీవో, సూపర్వైజర్ ఆదేశాల మేరకు అంగన్వాడి కేంద్రం ఆవరణంలో సహజంగా పండించిన ఆకు కూరగాయలను గర్భిణీ స్త్రీలకు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఆకుకూరలు కూరగాయలు తినడం వల్ల బాలింతలకు పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుందని అన్నారు. గర్భిణీ స్త్రీలు బాలింతలు సహజ ఆకుకూరలను పెరటి తోటల పెంచుకోవాలని వాటిపై పలు సూచనలను చేశారు.