

మన న్యూస్, ఎస్ఆర్ పురం:-ఎస్ఆర్ పురం మండలం తయ్యురు పంచాయతీ పెద్ద తయ్యూరు గ్రామానికి చెందిన సీనియర్ టిడిపి నాయకులు పాండురంగ చారి ఆకస్మికంగా మృతి చెందారు. ఈ సమాచారం అందుకున్న ఎస్ఆర్ పురం మండల పార్టీ అధ్యక్షులు గంధమనేని జయశంకర్ నాయుడు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కి పాండురంగ చారి మృతి తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి, మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు నాగరాజు, మంగుంట మాజీ సర్పంచ్ భూపతి రెడ్డి, నాయకులు మధు పాల్గొన్నారు.