

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ ,జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు శనివారం ప్రవేశ పరీక్ష జరుగనుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో రావాలని నిజాంసాగర్ నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్ కోరారు. పరీక్షకు హాజరు అయే విద్యార్థులు కేవలం బ్లూ బ్లాక్ బాల్ పెన్నుతో మాత్రమే సమాధానాలు రాయాలని సూచించారు. పరీక్ష హాల్లోకి ఫోన్లు స్టార్స్ వాచ్ వంటి ఎలక్ట్రికల్ వస్తువులను పరీక్ష హాల్ కి అనుమతించబోమని విద్యార్థులకు గమనించాలని అన్నారు.ఉమ్మడి జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు గంట ముందుగానే చేరుకోవాలని,11 గంటల తర్వాత లోనికి అనుమతించబోమని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో 2902,కామారెడ్డి జిల్లాలో 3138 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నట్లు తెలిపారు. పరీక్ష సజావుగా జరిగే విధంగా విద్యార్థులు, విద్యార్థినిల తల్లిదండ్రులు సహకరించాలని నవోదయ ప్రిన్సిపాల్ కోరారు.