

తవణంపల్లి జనవరి 17 మన న్యూస్
అమర రాజా సంస్థల చేయూతతో, రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా,తవణంపల్లి మండలం,దిగువమాఘం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (ARSDC) లో నిరుద్యోగ యువతకి ఉచిత శిక్షణ, ఉపకార వేతనం మరియు ఉద్యోగావకాశం పొందేందుకు మొదటి బ్యాచ్ కిగాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ/ పీసీబీ అసెంబ్లీ ఆపరేటర్ కోర్సు నందు 24 నెలలు (3 నెలలు ట్రైనింగ్ సెంటర్ నందు మరియు 21 నెలలు కంపెనీలో) శిక్షణ ఇవ్వబడును. శిక్షణా కాలంలో రూ. 12,072/- ఉపకార వేతనం (స్టైపెండ్) ఇవ్వనున్నట్లు యాజమాన్యం తెలిపారు. ఈ నెల 20వ తేదీన అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (ARSDC), దిగువమాఘం నందు ఇంటర్వ్యూ జరుగును. 10 వ తరగతి పాస్/ఫెయిల్ లేదా ఇంటర్ పాస్/ఫెయిల్ అయిన నిరుద్యోగ యువతి మరియు యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరములు కొరకు ఈ ఫోన్ నెంబర్లను 8712608589, 9739290499, 8807226264 సంప్రదించండి.
