

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ ,నిజాంసాగర్ మండలంలోని జడ్పిహెచ్ఎస్ అచ్చంపేట్ కాంప్లెక్స్ ఫరిదిలోని మాగి హేబిటేషన్ పరిధిలో బడి బయట పిల్లలను గుర్తించడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా .. సిఆర్ పి శ్రీధర్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు మండల విద్యాధికారి పర్యవేక్షణలో భాగంగా బడి ఈడు పిల్లలు బడి బయట ఉండకుండా బడిలోనే ఉండేలా వారిని గుర్తించి బడిలో చేర్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. మాగి గ్రామంలో 9 వ తరగతి చదువుతూ మధ్యలో బడిమానవేసిన విద్యార్థిని గుర్తించడం జరిగిందన్నారు.ఆ విద్యార్థిని సంక్రాంతి సెలవుల అనంతరం స్థానిక నిజాంసాగర్ కస్తూర్బా బాలిక పాఠశాలలో చేర్పించడం జరుగుతుందని అన్నారు.ఈనెల 30 తారీఖు వరకు కొనసాగుతుందన్నారు. 15 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వరకు విద్యను మానివేసిన వారికి ప్రత్యేకంగా తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యలో ప్రవేశం కల్పించడం జరుగుతుందన్నారు.అలాగే 5 నుంచి 14 సంవత్సరాల లోపు విద్యార్థులను గుర్తించి పాఠశాలలో చేర్పించడం జరుగుతుందన్నారు.బడి ఈడు పిల్లలను తమ తల్లిదండ్రులు బడిలో చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాగి ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సమీనా బేగం పాల్గొన్నారు.