

తవణంపల్లి జనవరి 13 మన న్యూస్
చిత్తూరుమాజీ మంత్రి గల్లా అరుణ కుమారి స్వగ్రామం చిత్తూరు జిల్లా దిగువ మాఘం గ్రామం లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి… తెల్లారి జామున జరిగిన భోగి వేడుకల్లో గల్లా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు… ప్రతి ఏటా సొంత ఊరిలో గ్రామస్తులతో కలసి తమ కుటుంబ సభ్యులు అందరం సంక్రాంతి సంబరాలు జరుపుకుంటామని గల్లా అరుణకుమారి తెలిపారు, భోగి, రంగోలి సంక్రాంతి పూజలు చేస్తామని తెలిపారు.. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సినిమా హీరో గల్లా అశోక్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.. ప్రతి ఏటా స్వగ్రామమైన దిగువ మాఘం లో కుటుంబ సభ్యులతో కలసి సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుందని అందరితో కలిసి పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.. త్వరలోనే యూత్ కు ఆకర్హించేవిధంగా సితార ప్రొడక్షన్లో కొత్త సినిమా రిలీజ్ అవుతుందని తెలిపారు తన మేనమామ మహేష్ బాబు ఆశీస్సులు ఎల్లవేళలా తనపైన ఉంటుందని కొత్తగా రానున్నా కొత్త సినిమాను అందరూ ఆదరించాలని కోరారు… ఈ సందర్భంగా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు తో కలిసి కోలాటం , గొబ్బియల్లు మరియు ఇతర సాంసృతిక కార్యక్రమాలలో అడి పాడారు.. ఈ కార్యక్రమంలో అమర రాజా అధినేత గల్లా రామచంద్ర నాయుడు , మాజీ ఎంపీ గల్లా జయదేవ్ , గౌనినేని రమాదేవి, గౌరీనేని హర్ష మరియు గౌరినేని విక్రమ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
