

మనన్యూస్,పాచిపెంట: పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోఆశా వర్కర్లు సమస్యలు పరిష్కారం చేయాలని కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశ వర్కర్లుగా గుర్తించాలని అర్హులైనటువంటి వారిని ఏ.ఎన్ఎం .లుగా ప్రమోట్ చేయాలని,కోరుతూ పాచిపెంట మండలం గురునాయుడుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ సూర్యచంద్రదేవ్ కి ఆశ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పి నాగవేణి ఈ రమాదేవి ఆధ్వర్యంలో వినతి పతనం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్ల సేవలను కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సేవలను గుర్తించి అన్ని విధాల ఆదుకోవాలని పని భారం తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రభుత్వ వైద్యాధికారులు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎన్నో సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లను కమ్యూనిటీ హెల్త్ వర్గాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని గత ప్రభుత్వ హయాంలో చేసిన పోరాటాల ఫలితంగా ఇచ్చినటువంటి హామీలు జీవోలు రూపంలో విడుదల చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు.హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వ పథకాలు కూడా వారికి వర్తింపజేసే విధంగా ఉండాలని అన్నారు.ముఖ్యంగా అర్హులైనటువంటి వారికి ఏ.ఎన్.ఎం.లుగా ప్రమోట్ చేయాలని వారికి రక్షణ సంబంధించి కిట్లు పంపిణీ చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేసి రాజకీయ వేధింపులు లేకుండా చూడాలని కోరారు. మెడికల్ ఆఫీసర్ సూర్య చంద్ర దేవ్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇచ్చిన వినత పత్రం లో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. ఆశ వర్కర్ ను ఉద్దేశించి మాట్లాడుతున్న సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు. ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
