

మన న్యూస్,తిరుపతి: జనసేన పార్టీ తిరుపతిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా డివిజన్ కమిటీలను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. సోమవారం ఉదయం ఓ హోటల్ లో జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో డివిజన్ అధ్యక్షులు ,ఉపాధ్యక్షులు,కార్యదర్శిలు,సంయుక్త కార్యదర్శలు, ఎన్నికల ముందు జనసేనలో చేరిన నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ నగరంలోని యాభై డివిజన్ లలో పార్టీని పష్టిష్టం చేస్తామన్నారు. సంక్రాంతి తరువాత డివిజన్ ల వారీగా పర్యటించి డివిజన్ కమిటీల నాయకులతో కలిసి ప్రజల సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.కార్పోరేషన్ ఎన్నికలు ఏడాదిలో వచ్చే అవకాశం ఉన్నందున ఆ సమయానికి జనసేన అన్నివిధాల సిద్ధంగా ఉండేలా తయారు చేస్తామని ఆయన చెప్పారు.గత ఎన్నికల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులను నామినేషన్ లు కూడా వేయనీయకుండా అడ్డుకుని అప్రజాస్వామికంగా ఏకగ్రీవం చేసుకుందని ఆయన ఆరోపించారు రానున్న కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రజాబలంతో ఎన్డీఏ కూటమి విజయదుందిభి మోగించడం ఖాయమని ఆయన తెలిపారు.ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర బిజేపి అధ్యక్షులు నిర్ణయిస్తారని ఆయన చెప్పారు. ఆ మేరకు కూటమి సమిష్టిగా ఎన్నికల్లో నిలబడి వైసిపిపై విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జనసేన కార్యకర్తలు, నాయకులకు ఏ చిన్న కష్టం వచ్చినా ఆదుకునేందుకు తాను ముందుండనట్లు ఆయన చెప్పారు. గత ప్రభుత్వంలో జనసైనికులుపై పెట్టిన కేసుల వివరాలు తెలిపితే న్యాయపరంగా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరి ప్రసాద్, పార్లమెంట్ పరిశీలకులు వెంకటేశ్వర్లు, ఆరణి శివ, ఆరణి మదన్, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, అధికారప్రతినిధి కీర్తన, రాయలసీమ కోఆర్డినేటర్ ఆకుల వనజ, కిరణ్ రాయల్, రాజా రెడ్డి, కార్పోరేటర్లు సికే రేవతి, కల్పనా యాదవ్, వరికుంట్ల నారాయణ తదితరలు పాల్గొన్నారు.