

మనన్యూస్:పాచిపెంట,పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పద్మాపురం లో రెవిన్యూ సదస్సు సందర్భంగా అధికారులకు రైతు సంఘం మండల కార్యదర్శి బోను గౌరు నాయుడు ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బోనుగౌరనాయుడు మాట్లాడుతూ తాతల కాలం నుండి సాగు చేస్తున్న పద్మాపురం భూములకు నేటికీ ఇనాం భూములు పేరుతో కాలయాపన చేస్తూ పట్టాలు మంజూరు చేయకపోవడం రైతాంగాన్ని దగా చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు నేటికీ పట్టాలు లేకపోవడం వలన పంట రుణాలు అందక బోర్లు తీసుకోక ఎటువంటి ప్రభుత్వ పథకాలు అందగా నష్ట పరిహారం చెల్లించకపోవడం వలన తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగాన్ని ఇప్పటికైనా పట్టాలి ఇచ్చే ఆదుకోవాలని కోరారు.అలాగే పెద్దగెడ్డ ఎడమ కాలువ ద్వారా లిఫ్టు ద్వారా సాగునీరు అందిస్తే ఐదు పంచాయతీలకు చెందిన 10,000 ఎకరాలకి సాగునీరు అందుతుందని అన్నారు అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాంతం అభివృద్ధి కోసం పాటుపడాలని జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమస్య తీసుకువెళ్లి యుద్ధ ప్రాతిపదికన సాగు పట్టాలు మరియు పెద్దగడ్డ ఎడమ కాలువ వచ్చేటట్టు పట్టాలు ఇచ్చేటట్టు కృషి చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అఖిల భారత మహిళా సంఘం నాయకులు బి ఎర్రమ్మ గిరిజన సంఘం నాయకులు టి చిన్నారావు సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు పాల్గొన్నారు.