

తవణంపల్లి జనవరి 3 మన న్యూస్
తవణంపల్లి మండల కేంద్రంలోని తవణంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సేవాస్ఫూర్తితో పాఠశాల రూపురేఖలు మారి మౌలిక సదుపాయాలతో పాఠశాల అభివృద్ధికి చేయూతనిస్తున్న పూర్వ విద్యార్థులతో పాఠశాల అందంగా రూపుదిద్దుకుంది. మండల కేంద్రంలో 1969లో ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేశారు. పూర్వ విద్యార్థుల సహకారంతో పాఠశాల ప్రతి ఏటా అందంగా రూపుదిద్దుకుంటూ ఉన్నది. ఈ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు మౌలిక సదుపాయలతో ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యార్థులు హాయిగా ఆడుకుంటూ చదువుకుంటూ విద్యను అభ్యర్థిస్తున్నారు. ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు పై చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదిగి స్థిరపడ్డారు. ఈ క్రమంలో పాఠశాల మరింత అభివృద్ధికి తోడ్పడాలని 1991- 92 సంవత్సరములో చదువుకున్న పూర్వ విద్యార్థులు కొంతమంది సంపత్ కుమార్, రాజా రమేష్, జగదీశ్వర్ నాయుడు, తులసి ప్రభ, శైలజ, జయశ్రీ,, లీలామనోహర్, చంద్రశేఖర్ రెడ్డి, లవన్ కుమార్ రెడ్డి, జి.నాగరాజ్, చంద్ర, రాధాకృష్ణ, సి.నాగరాజ, అనంత కుమార్, ఇన్బనాధన్, మురుగేష్, పాఠశాలను సందర్శించి మరింత అభివృద్ధికి తోడ్పడాలని పూర్వ విద్యార్థుల అందరి సహకారంతో తమ వంతు సహాయ సహకారాలు అందించాలనే సంకల్పంతో ముందుకు వచ్చారు. విద్యార్థుల అందరి సహకారంతో 30000 వేల రూపాయలతో పాఠశాలలో పాత విధానంలో ఉన్న బెల్ ను మార్చి విలువైన ఆటోమెటిక్ ఎలక్ట్రికల్ బెల్ ను, అమర్చాలని అలాగే నాణ్యమైన బీరువా, పోడియం, కుర్చీలు, విరాళంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవరాజుల రెడ్డి, ఉపాధ్యాయులు విజయ కృష్ణారెడ్డి, లవన కుమార్ రెడ్డికి అందించి అభినందనలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.