

ఎల్లారెడ్డి,నిజాంసాగర్,
మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలను శుక్రవారం ఎల్లారెడ్డి ఎంపీడీవో ప్రకాష్ తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను, తరగతి గదులను డార్మెటరీని మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మెనూ ప్రకారం భోజనం, గుడ్లు, చికెన్, పండ్లు,ఇతర స్నాక్స్ ఇస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రూమ్ లో కూరగాయలు, పప్పులు, ఇతర ఆహార పదార్థాలు తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తంచేశారు. ప్రిన్సిపాల్ మహమ్మద్ రఫత్, ఎస్ ఎల్ సి బాలరాజు, ప్రవీణ్ కుమార్, మంజూరు, ఖాజా, సంతోష్ ,సాజిద్ తదితరులు పాల్గొన్నారు