

మన న్యూస్,నిజాంసాగర్,ఎల్లారెడ్డి ,
మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ప్రిన్సిపాల్ మహమ్మద్ రఫత్ , ఉపాధ్యాయులతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మహిళ ఉపాధ్యాయులకు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు సావిత్రిబాయి పూలే జీవిత విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎల్ సి బాలరాజ్, ఉపాధ్యాయులు మంజుర్ ఖాన్ , ప్రవీణ్ కుమార్, ఖాజా,నాగరాజు, దత్తాత్రేయ, నవీన్ కుమార్, శివ ప్రసాద్, ఫర్హాన , రిజ్వన, శ్రీదేవి, అనురాధ, బాలమనీ,సయ్యద్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.