

తవణంపల్లి జనవరి 2 మన న్యూస్
తవణంపల్లి మండలంలోని దిగువ తడకర గ్రామం నందు ఓంశక్తి భక్తుల పూజా కార్యక్రమంలో భాగంగా భక్తులకు అన్నదానం ఏర్పాటుచేసి దగ్గరుండి భక్తులకు తవణంపల్లి మండలం జడ్పిటిసి భారతి మధు కుమార్ భోజనాలు వడ్డించడం జరిగింది. అనంతరం దిగువ తడకర గ్రామంలో ప్రతి ఏటా అధిక సంఖ్యలో మహిళలు ఓం శక్తి మాలలు వేసి ఘనంగా పూజలు నిర్వహించేవారు. అదే ఆన వాయితిగా ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో భక్తిశ్రద్ధలతో మహిళలు మాలలు వేసి అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు. అమ్మవారి సేవలో తవణంపల్లి మండలం జడ్పిటిసి భారతి మధుకుమార్ దంపతులు పాల్గొని పూజలు చేసి దర్శించుకున్నారు. అనంతరం వారు భక్తులకు అన్నదానం ఏర్పాటుచేసి దగ్గరుండి భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఓంశక్తి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.