

తవణంపల్లి జనవరి 2 మన న్యూస్
తవణంపల్లి మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత ,ఉన్నత పాఠశాలు (మొత్తం 66 పాఠశాల కు ) ప్రధానోపాధ్యాయులకు మరియు ఎస్.ఎం.సి చైర్మన్ లకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తవణంపల్లి నందు ఒక రోజు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమం మండల విద్యాశాఖ అధికారి హేమలత మరియు త్యాగరాజ రెడ్డి గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జిల్లాలో శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్ మునస్వామి ,చిరంజీవి, బాలచంద్రారెడ్డి ద్వారా మండలంలోని ఉపాధ్యాయులకు ,ఎస్ఎంసి సభ్యులకు
1. పాఠశాల మౌలిక వసతులపై 2. విద్యార్థులు 100% హాజరయ్యేటట్లు 3. మధ్యాహ్న భోజనం 4. బడి బయట పిల్లల గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది. మండలంలో శిక్షణ పొందిన ప్రధానోపాధ్యాయులు మరియు ఎస్ఎంసి చైర్మన్ ద్వారా 3 తేదీ నుండి 6 తేదీ వరకు పాఠశాల స్థాయిలో శిక్షణ ఇవ్వాల్సిందిగా మండల విద్యాశాఖ అధికారి 1 మరియు 2 తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా రిసోర్స్ పర్సన్స్ పెద్దబ్బ రెడ్డి , చిరంజీవి, మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దేవరాజు రెడ్డి , సి ఆర్ పి లు పాల్గొన్నారు జరిగింది.
