మన న్యూస్:నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,అల్లూరు మండలం,అల్లూరు పట్టణంలో మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా పోలేరమ్మ జాతర కార్యక్రమం నిర్వహించారు.జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే జాతర లో అల్లూరు పోలేరమ్మ జాతర ఎంతో ముఖ్యమైన ది.ప్రతి ఆట జరుగుతున్న ఈ జాతరలో భాగంగా ఈ సంవత్సరం కూడా మాజీ శాసనసభ్యులు,వైయస్సార్ సి పి సీనియర్ నాయకులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు దగుమాటి. వెంకట కృష్ణారెడ్డి,జిల్లాలోని పలువు రు ముఖ్య నాయకులు, కార్యకర్తలు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.వచ్చిన భక్తులు ముక్కులను తీర్చుకున్నారు.ఈ జాతరకు జిల్లా నలుమూలల నుండి వేలాదిమంది భక్తులు హాజరయ్యారు.ఒక్క నెల్లూరు జిల్లా నుండి కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు జాతర సందర్భంగా తప్పిట్ల మూతతోఅల్లూరి పట్టణం దద్దరిల్లింది. పట్టణమంతా విద్యుత్ దీపాలతో శోభాయమానంగా వెలుగునిచ్చింది.బుధవారం అమ్మవారిని గ్రామోత్సవం నిర్వహించారు.ముందు జాగ్రత్తగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాతర కార్యక్రమం జరగటం విశేషం.









