మన న్యూస్,నిజాంసాగర్ , జుక్కల్ , చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చేపల వల కాళ్లకు చుట్టుకుని వ్యక్తి మృతి చెందిన సంఘటన కొమలాంచ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం బాన్సువాడ మండలంలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన బెస్త సాయిలు (36) మహమ్మద్ నగర్ మండలం కొమలాంచ గ్రామ శివారులోని మంజీరా నదిలో అదే గ్రామానికి చెందిన నక్కల సాయిలు, అంకాసి సాయిలు, కోళ్ల గంగారంతో కలిసి మంగళవారం చేపలు పట్టేందుకు వెళ్లారు. చేపలు పడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు బెస్త సాయిలు కాళ్లకు వల చుట్టుకొని నీటిలో నుంచి బయటకు రాలేక మృత్తి చెందాడు. మృతుడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య విడాకులు కోరుతూ భర్తకు దూరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవపంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *