

మనన్యూస్:తిరుపతి,తెలుగు దేశం పార్టీ నాయకులు టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ పి భువన్ కుమార్ రెడ్డి ని నగరంలోని పలువురు ప్రజా ప్రతినిధులు,అధికారులు,స్నేహితులు కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు ఆయనకు శాలువులతో సత్కరించి పూల బోకెలను ను అందజేశారు.సందర్భంగా భువన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2025 సంవత్సరములో జిల్లా ప్రజలతో పాటు తిరుపతి వాసులంతా సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.భువన్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో వెంకట,రమేష్ రెడ్డి,బాబు భాస్కర్ రెడ్డి వి ఆర్ సురేష్,హరి,లచ్చి తదితరులు ఉన్నారు.