

నిజామాబాద్ పవర్ ను సీఎం రేవంత్ రెడ్డికి రుచి చూపిస్తాం,
నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
మన న్యూస్,నిజామాబాద్,కేసిఆర్ ను రాజకీయంగా ఎదుర్కులేకనే తనపై,కేటిఆర్ పై కేసులు నమోదు చేశారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.లిక్కర్ స్కాం కేసులో జైలు నుంచి విడుధల తరువాత తొలిసారి నిజామాబాద్ కు వచ్చిన ఎమ్మెల్సీ కవితకు జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టి తరుపున అపూర్వ స్వాగతం లభించింది. ఈ సంధరంగా ఎస్ఎఫ్ఎస్ సర్కిల్ వద్ధ తెలంగాణ తల్లి విగ్రహానికి పులమాలలు వేసి కవిత మాట్లాడుతూ..
నిప్పు లాంటి నిజామాబాద్ బిడ్డను తప్పు చేయలేదు, నిప్పు కణికల కేసుల నుంచి బయటకు వస్తాం అన్నారు. తాను కేసులకు భయపడే రకం కాదని, భయపెట్టే రకం అన్నారు.కేంద్రాన్ని ఎదురించి ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతోంది, రాష్ట్రంలో అక్రమ కేసులపై గురించి చెప్పనవసరం లేదు అన్నారు. తెలంగాణ సాధనకు ఉద్యమం చేసిన ఘనత వహించిన పార్టికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు పట్టం కడుతారని కవిత అన్నారు. రాబోయేది గులాబి జండా శకం అని గుర్తు చేశారు. పెద విద్యార్ధుల కోసం కేసిఆర్ పెట్టిన గురుకులాలను నడుపలేని అసమర్ధ ప్రభుత్వం అని 57 మంది విద్యార్ధులను పొట్టన పెట్టుకున్నదని ఆరోపించారు. ఉద్యోగులను, నిరుద్యోగులను, మహిళలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. మహిళకు ఉచిత బస్సు పథకంను తామ స్వాగతించామని , కేసిఆర్ తీసుకువచ్చిన ప్రజా సంక్షేమ పథకాలను కోనసాగించాలని కవిత డిమాండ్ చేశారు.సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడు తెలంగాణ తల్లి స్థానంలో కాంగ్రెస్ మాతను ఏర్పాటు చేశారు అన్నారు. మన తెలంగాణ తల్లి మనకు కావాలి.తెలంగాణ తల్లి మాదిరా కాంగ్రెస్ తల్లి మీదిరా అంటు నినాదాలు చేశారు. మన పొట్టమీదనే కాదు.మన సంస్కృతిపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తున్నది .ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని నిర్భందాలకు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదు.మళ్లొకసారి నిజామాబాద్ పవర్ ను సీఎం రేవంత్ రెడ్డికి రుచి చూపిద్దాం అని కవిత పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజ్య సభ సభ్యులు సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా, మాజీ జడ్పి చైర్మెన్ విఠల్ రావు, మాజీ నుడా చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ జడ్పిటిసీ బాజీరెడ్డి జగన్, మాజీ కార్పోరేటర్ విశాలిని రెడ్డి తో పాటు కార్పోరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.