రేణిగుంట (తిరుపతి జిల్లా)

దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ గా విశేష సేవలందించి పదవీ విరమణ పొందిన డాక్టర్ నిర్మలారాజ రామ్ ను ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ , నేషనల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మరియు బ్రాంచ్ కార్యదర్శి ఆర్.ఎం. విజయకుమార్ ఘనంగా సన్మానించారు.

​పదవీ విరమణ కార్యక్రమానికి హాజరుకావాలని డాక్టర్ నిర్మలారాజ రామ్ పంపిన ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆర్.ఎం. విజయకుమార్ సికింద్రాబాద్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు.

​అనంతరం డాక్టర్ నిర్మలారాజ రామ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి, సాంప్రదాయ తల కిరీటాన్ని అలంకరింపజేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా ఒక మొక్కను (ప్లాంటేషన్ ట్రీ) బహూకరించడంతో పాటు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య ప్రసాదాలను అందజేశారు.

​ఈ సందర్భంగా ఆర్.ఎం. విజయకుమార్ మాట్లాడుతూ.. దక్షిణ మధ్య రైల్వే వైద్య విభాగంలో ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్‌గా డాక్టర్ నిర్మలారాజ రామ్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రైల్వే ఉద్యోగులు, కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడంలో వారు చూపిన చొరవ, అంకితభావం ఎందరికో ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతర జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో సాగాలని ఆయన ఆకాంక్షించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *