
నూతన సర్పంచ్ కు ఉపాధ్యాయులు ఘన సన్మానం
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మడిబాక గ్రామపంచాయతీ రాజుల కండ్రిగ ఆదర్శ పాఠశాల నందు గురువారం జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ పలుకూరి మణి సతీమణి లీలావతి ని స్థానిక ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపింది. ఈరోజు శనివారం పాఠశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బాల సరస్వతి మరియు ఉపాధ్యాయులు నూతన సర్పంచుకు పుష్పగుచ్చం అందించి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధితోపాటు పాఠశాల మౌలిక వసతుల కల్పనకు, విద్యార్థుల విద్యాభివృద్ధికి సర్పంచ్ సహకారం అందించాలని కోరారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


