​రేణిగుంట (తిరుపతి జిల్లా):

సమాజంలో నెలకొన్న అసమానతలను రూపుమాపడానికి ‘సత్యశోధక్ సమాజ్’ స్థాపించిన మహాత్మా జ్యోతిరావు పూలే బహుజనుల ఆరాధ్య దైవమని, భారతదేశంలో ఆయన తిరుగులేని నాయకుడని జాతీయ బీసీ నాయకులు పూల వెంకటాద్రి యాదవ్ కొనియాడారు. శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా స్థానిక రేణిగుంటలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

​ఈ సందర్భంగా వెంకటాద్రి యాదవ్ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులకు కేంద్ర ప్రభుత్వం తక్షణం దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పూలే ఆశయ సాధన కోసం బహుజనులంతా ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

​రాబోయే రోజుల్లో మహాత్మా పూలే ఆదర్శాలను ఆచరణలో పెడుతూ, 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని, బహుజనులే ముఖ్యమంత్రిగా కొనసాగేలా నాయకులు సమష్టి కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.

​ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు విద్యాసాగర్, ఎం.జి. రాజేష్, అంబికాపతి తదితరులు పాల్గొని పూలేకు నివాళులర్పించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *