ఏర్పేడు, నవంబర్ 28:

డిసెంబర్ మొదటి వారం ఏర్పేడు ఐ ఐ ఎస్ ఈ ఆర్ లో నిర్వహించనున్న డి జి పి లు, ఐ జి పి ల సమావేశం సందర్భంగా భద్రత, మౌలిక వసతులు తదితరాలను శనివారం జిలా ఎస్ పి ఎల్. సుబ్బారాయుడు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావుతో కలసి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పర్యవేక్షించారు. డిసెంబర్ మొదటి వారం ఏర్పేడు ఐ ఐ ఎస్ ఈ ఆర్ లో నిర్వహించనున్న డి జి పి లు, ఐ జి పి ల సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత, రోడ్లు, సుందరీకరణ, వీధి దీపాలు వంటి మౌలికవసతుల ఏర్పాటును కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఎం జయ కృష్ణ, శ్రీకాళహస్తి ఆర్ డి ఓ భాను ప్రకాష్ రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు, ఆర్ అండ్ బి, పోలీస్, హార్టీ కల్చర్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *