• అభివృద్ధే లక్ష్యంగా ఓటర్లను అభ్యర్థిస్తున్న ఫాతిమా బేగం
• వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న మూడా హాజరత్తయ్య
కలిగిరి, నవంబర్ 22 మన ధ్యాస ప్రతినిధి శ్రీకాంత్ కుట్టుబోయిన
కలిగిరి గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తెలుగుదేశం పార్టీ మద్దతుతో కలిగిరి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షేక్ ఫాతిమా బేగం, 7వ వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్న మూడా హాజరత్తయ్య కలిసి ఆదివారం కలిగిరి ఎమ్మార్వో కార్యాలయ సెంటర్ వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను కలిసి తమకు మద్దతు తెలపాలని కోరారు.సర్పంచ్ అభ్యర్థి షేక్ ఫాతిమా బేగం మాట్లాడుతూ.. కలిగిరి గ్రామ పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా పనిచేస్తానని, ప్రజలు తనకు అవకాశం కల్పిస్తే గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన ఎన్నికల గుర్తు “కత్తెర”పై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.అనంతరం 7వ వార్డు అభ్యర్థి మూడా హాజరత్తయ్య మాట్లాడుతూ.. వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. నిత్యం వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొంటూ, తన ఎన్నికల గుర్తు “గౌను”పై ఓటు వేసి గెలిపించాలని 7వ వార్డు ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో అనంతపురం ఎంపీటీసీ బీజం ఖాజా కుమారి , తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇద్దరు అభ్యర్థులు తమ ఎన్నికల గుర్తులను ప్రజలకు వివరిస్తూ, గ్రామ మరియు వార్డు అభివృద్ధికి తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

