ఎంపీడీవో రవిచంద్ర.

​రేణిగుంట (తిరుపతి జిల్లా): రేణిగుంట మండల పరిధిలోని గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మండలంలోని 19 గ్రామ పంచాయతీ,206 వార్డులకు సంబంధించి ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు మొత్తం ఆరు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రేణిగుంట ఎంపీడీవో రవిచంద్ర తెలిపారు.​ఏర్పాటు చేసిన ఆరు నామినేషన్ కేంద్రాలు మరియు వాటి పరిధిలోని పంచాయతీలు:

​గ్రామ పంచాయతీ కార్యాలయం, ఎలమండ్యం:ఎలమండ్యం, గురవరాజుపల్లె, జీపాలెం.

​గ్రామ పంచాయతీ కార్యాలయం
గాజులమండ్యం: అత్తూరు , గాజులమండ్యం, సూరప్పకాశం, తండ్లం,
విప్పమాని పట్టెడ.

​గ్రామ పంచాయతీ కార్యాలయం కరకంబాడి:కరకంబాడి, మామండూరు, వెంకటాపురం.

​గ్రామ పంచాయతీ కార్యాలయం
రేణిగుంట: రేణిగుంట.

​స్వర్ణ గ్రామం
ఆర్. మల్లవరం:
గుత్తివారిపల్లి, కృష్ణాపురం, ఆర్. మల్లవరం, శ్రీనివాసఉదాసిపురం, వేడుళ్ళచెరువు.

​గ్రామ పంచాయతీ కార్యాలయం తూకివాకం: కొట్రమంగళం , తూకివాకం.
​అర్హతలు మరియు భద్రతా ఏర్పాట్లు..

​ఎన్నికల ముఖ్య తేదీలు మరియు షెడ్యూల్..

​నామినేషన్ల స్వీకరణ నవంబర్ 15 నుండి 17 వరకు ,
​నామినేషన్ల పరిశీలన నవంబర్ 18,
​అప్పీళ్ల నవంబర్ 19,
​అప్పీళ్ల పరిష్కారం నవంబర్ 20,
​అభ్యర్థుల తుది జాబితా ప్రకటన నవంబర్ 21,
​పోలింగ్ మరియు కౌంటింగ్ నవంబర్ 26న ఉదయం 7:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం మధ్యాహ్నం నుండి ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీసం 21 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలని ఎంపీడీవో స్పష్టం చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద మరియు కౌంటింగ్ కేంద్రాలలో అన్ని మౌలిక సదుపాయాలు, ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *