ఉదయగిరి, నవంబర్ 09,మన మన ధ్యాస RC ఇన్చార్జి నాగరాజు.

ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయ డంకా మోగించి తన సత్తా చాటింది. ప్రజల విశ్వాసం, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అత్యద్భుత వ్యూహం ఈ ఘన విజయానికి కారణమయ్యాయి.
అభివృద్ధే ఆయుధంగా…
ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాలు ఉన్నాయి. గత రెండున్నర సంవత్సరాలుగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నియోజకవర్గాన్ని పలు సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి బాట పట్టించారు. రోడ్లు, తాగునీరు, సంక్షేమ పథకాల అమలు, యువతకు ఉపాధి వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల మనసు గెలుచుకున్నారు. ప్రజలకు తలలో నాలుకలా వ్యవహరిస్తూ, ప్రతి గ్రామానికి అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.
25 ఏళ్ల చరిత్రను తిరగరాసిన విజయం…
గత 25 సంవత్సరాలుగా సీతారాంపురం వంటి మండలాల్లో స్థానిక ఎన్నికల్లో గెలవని తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో విజయ పతాకాన్ని ఎగురవేసింది. 2004 నుండి 2024 వరకు ఈ నియోజకవర్గంలో తెదేపాకు ప్రతికూలంగా ఉన్న అన్ని అంశాలను పక్కకు నెట్టి ఎమ్మెల్యే కాకర్ల తనదైన శైలిలో కేడర్‌ను కాపాడుకుంటూ, ప్రజల్లోకి వెళ్లి ఈ విజయాన్ని సాధించారు.
లెక్కలు ఇలా…
నియోజకవర్గంలోని 8 మండలాల్లో మొత్తం 83 ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఉండగా వాటిలో కూటమి 62 ఎంపీటీసీ, 7 ఎంపీపీ, 7 జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకొని స్థానిక ఎన్నికల్లో అజేయంగా నిలిచింది. అంటే దాదాపు 90 శాతం స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. ఇది నియోజకవర్గ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విజయం.
పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం…
ఈ విజయంతోనే ఆగకుండా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సైతం ఇప్పటి నుండే సమాయత్తమవుతున్నారు. కేడర్‌కు నూతన ఉత్తేజాన్ని కలిగిస్తూ, ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేస్తున్నారు. కాకర్ల సురేష్ నాయకత్వంలో ఉదయగిరి నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా నిలుస్తుందని ప్రజలు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *