13 ఎంపీటీసీ స్థానాలకు గాను 9 స్థానాల్లో టీడీపీ విజయదుందుభి

జడ్పీటీసీ స్థానాన్ని సైతం కైవసం చేసుకున్న కూటమి

గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చిన మండల అధ్యక్షుడు పూసాల వెంగప నాయుడు

కలిగిరి, నవంబర్ 8: మన ధ్యాస ప్రతినిధి శ్రీకాంత్

కలిగిరి మండలంలో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ పూర్తవడంతో మండలవ్యాప్తంగా పసుపు ప్రభంజనం స్పష్టమైంది. మొత్తం 13 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 9 స్థానాలను టీడీపీ కైవసం చేసుకోగా, జడ్పీటీసీ స్థానాన్ని సైతం గెలుచుకుని ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ ఫలితాలతో కలిగిరి మండల రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. ఈ విజయ ప్రస్థానంలో టీడీపీ కలిగిరి మండల అధ్యక్షుడు పూసాల వెంగప నాయుడు పోషించిన పాత్ర ప్రత్యేకంగా నిలిచింది. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆయన పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకొచ్చి సమన్వయంతో ముందుకు సాగారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ, అభ్యర్థులకు అండగా నిలుస్తూ విజయమే లక్ష్యంగా కృషి చేశారు. మండలవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం సాధించి ఎన్నికల సమరంలో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఆయన నాయకత్వంలో పార్టీ అభ్యర్థులు 13 ఎంపీటీసీ స్థానాల్లో 9 స్థానాలను గెలుచుకోవడంతో పాటు జడ్పీటీసీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవడం టీడీపీకి రాజకీయంగా మరింత బలాన్ని చేకూర్చింది. ఈ ఫలితాలతో పసుపు శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. కలిగిరి మండలంలో టీడీపీ సాధించిన ఈ ఘన విజయం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపగా, పూసల వెంగప నాయుడు నాయకత్వం, ఎన్నికల్లో ఆయన పోషించిన సమన్వయ పాత్రకు ప్రత్యేక గుర్తింపు లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *