మనన్యూస్:ఏలేశ్వరం :భద్రవరం గ్రామాలలో నిర్వహించే రెవెన్యూ సదస్సులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఎంపీపీల సమైక్య అధ్యక్షుడు, ఏలేశ్వరం మండల అధ్యక్షుడు గొల్లపల్లి నరసింహమూర్తి పేర్కొన్నారు.ఈ మేరకు గురువారం మండలంలోని భద్రవరం గ్రామంలో స్థానిక సచివాలయంలో డిప్యూటీ తహసిల్దార్ కుశరాజు అధ్యక్షతన నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఈ రెవెన్యూ సదస్సులలో భాగంగా అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని అలా స్వీకరించిన అర్జీలపై సదస్సులో చర్చించి వీలైనంతవరకు అక్కడికక్కడే సమస్యకు పరిష్కారం చూపుతారని అన్నారు. గత ఐదేళ్లుగా పేరుకుపోయిన భూ సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. గత ప్రభుత్వం భూ సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ఈ నేపథ్యంలో మండల రెవెన్యూ అధికారులను ప్రభుత్వం ఆదేశించిన నిర్దేశం ప్రకారం గ్రామ సభల్లో ఫ్రీహోల్డ్, 22ఏకు సంబంధించిన భూములు,ఇతరత్రా భూ సమస్యలు, వివాదాలపై వినతులు స్వీకరిస్తారు.భూ సమస్యలను సుమారు 45 రోజుల్లోగా పరిష్కరిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు,సచివాలయ సిబ్బంది,స్థానిక నాయకులు పాల్గొన్నారు.