

మన న్యూస్: ఏలేశ్వరం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ ముద్రగడ గిరిబాబుని ప్రత్తిపాడు నియోజకవర్గం,ఏలేశ్వరం టౌన్ అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ శిడగం వెంకటేశ్వరరావు,నగర పంచాయితీ కో ఆప్షన్ సభ్యులు షేక్ దిల్బర్ హుస్సేన్,వాగు బలరాం,దాకమూరి లోవరాజు కిర్లంపూడిలో ముద్రగడ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ముద్రగడ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వారితో చర్చించారు.గిరిబాబుని మీరందరూ ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మూడో వార్డు కౌన్సిలర్ బదిరెడ్డి గోవింద్,జువ్విన వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.