

మన న్యూస్:పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో గ్రామ గ్రామాన ప్రార్ధనాలయాల్లో క్రిస్టమస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా యేసు విశ్వాసికులు ప్రత్యేక ప్రార్థనలు ఆరాధనలతో చర్చి ప్రాంతాలు జనసంద్రంగా మారడం జరిగింది. చర్చి పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు జరిపి ప్రతి ఒక్కరికి దేవుని ఆశీర్వచనం అందించడం జరిగింది.అర్ధరాత్రి నుంచి చర్చిలు రంగురంగుల దీపాల కాంతులతో పండుగ శోభను సంతరించుకున్నాయి. దీంట్లో భాగంగా మండల కేంద్రంలోని చర్చిలు క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకొని చర్చి పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించటం జరిగింది. క్రైస్తవ ఆరాధన పాటలు,పదాల స్మరణతో నిండిపోవడం జరిగింది.ఈ సందర్భంగా చర్చి పాస్టర్లు ఏసుక్రీస్తు ఆశయాలను గౌరవించేందుకు క్రిస్టమస్ సంతోషకరమైన సందర్భం అని ప్రభువు ప్రేమికులు ప్రతి ఒక్కరూ శాంతి, కరుణతో తమ జీవితాన్ని కొనసాగించాలని,ఏసు క్రీస్తు విశ్వాసులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది.