

మనన్యూస్:ఆర్ కె పురం డివిజన్ హరి పురి కాలనీ పార్క్ సంక్షేమ సంఘ భవనం లో భారతీయ యోగా సన స్థాన్ గత కొన్ని సంవత్సరాలుగా నిస్వార్థ సేవ భావంతో ఏర్పాటు చేసిన యోగ సమస్థ దీనిలో భాగంగా అంతర్జాతీయ మహిళ శక్తి యోగ్ దివాసు పురస్కరించుకొని పలు కాలనీ వాసులతో కలసి డివిజన్ లోని హరి పురి కాలనీ పార్క్ లో మహిళ శక్తి యోగ్ దివాసు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్త్రీ వైద్య నిపుణులు గైనకాలజిస్ట్ డాక్టర్ కామేశ్వరి. డాక్టర్ పద్మావతి ,డాక్టర్ .సూర్య ప్రకాష్ వింజమూరి పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్త్రీలకు సంబంధించిన వ్యాధుల గురించి వివరిస్తూ వ్యాధులను నయం చేసుకోవడానికి మందులతో కాకుండా .ఆహారం తో యోగా ద్వారా ఎలా ఆరోగ్యవంతంగా ఉండాలో చక్కగా సూచించారు. అలాగే డాక్టర్ సూర్య ప్రకాష్ వింజమూరి, మాట్లాడుతూ స్త్రీల పాత్ర ఎంతో గొప్పదని చాలా గొప్పగా వివరించారు.డిస్టిక్ 3 ప్రెసిడెంట్ బి.కృష్ణయ్య, మాట్లాడుతు యోగా అనేది శారీరక, మానసిక భగవద్గీతలోని సారాంశ ఆధారంగా ఆధ్యాత్మిక సాధనను సాధించడానికి పురాతన మార్గమని అన్నారు, అందరూ ప్రతీ రోజు యోగ చేయాలని,ఆరోగ్యంగా ఉండాలని తెలియజేశారు.
ఆనంతరం ఈ కార్యక్రమానికి సహకరించిన తాడేపల్లి వెంకటేష్ గుప్తా, మాట్లాడుతూ యోగా సాధకులు ఈ పార్కుకు వచ్చి రోజు యోగ సాధన చేయడం వల్ల మా పార్కు శోభమయంగా మారి నీటిగా ఉండడం జరుగుతుందని యోగా సాధకులు ఈ పార్కును ఎల్లవేళలా తప్పకుండా వినియోగించుకోవాలని ఇంకా ఏమైనా సహాయ సహకారాలు కావాలన్నా మేము యోగా సెంటర్ యోగ సాధకులకు సహాయపడతామని తెలియజేశారు. అనంతరం యోగా గురువులకి
ఈ కార్యక్రమానికి సహకరించిన తాడేపల్లి వెంకటేష్ గుప్తాను ఘనంగా శాలువలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో వి మధు, రామా జోన్ చీఫ్ రవి. గౌట్ ప్రెస్ కాలనీ అఫీషియల్ జోనల్ చీఫ్ ఎల్ మాధవరెడ్డి, సెంటర్ ఇన్చార్జ్ కె లక్ష్మారెడ్డి ,హరి పురి కాలనీ ప్రెసిడెంట్ తాడేపల్లి వెంకటేష్ గుప్తా,యోగ సాధకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.